Monday, April 29, 2024

ఉత్త‌మ్ కి కోమ‌టిరెడ్డి షాక్ – న‌ల్గొండ నుంచి ఎంపిగా పోటీ చేస్తానంటూ ప్ర‌క‌ట‌న‌….

హైద‌రాబాద్ – కాంగ్రెస్ సీనియ‌ర్ నేత , భువ‌న‌గిరి ఎంపి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి త‌న స‌హ‌చ‌ర నేత‌, న‌ల్గొండ ఎంపి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కి షాక్ ఇచ్చారు.. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో ప్ర‌స్తుతం ఉత్త‌మ్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న న‌ల్గొండ లోక్ స‌భ స్థానం నుంచి పోటీ చేయ‌నున్న‌న‌ట్లు ప్ర‌క‌టించారు.. నల్గొండ అంటే త‌న‌కు ప్రాణమ‌ని, అందుకే రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేస్తానని తేల్చి చెప్పారు.. కాగా ఈనెల 28న నల్లగొండలో జరిగే నిరుద్యోగ నిరసన సభలో పాల్గొంటానని ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు. ఇది ఇలా ఉంటే వాస్త‌వానికి న‌ల్గొండ‌లో ఎంపి ఉత్త‌మ్ కుమార్ ఆధ్వ‌ర్యంలో ఈ నెల 21వ తేదినే నిరుద్యోగ నిర‌స‌న స‌భ జ‌ర‌గాల్సి ఉంది.. అయితే త‌న‌ను సంప్ర‌దించ‌కుండా ఎలా స‌భ ఏర్పాటు చేస్తారంటూ కోమ‌టిరెడ్డి ప్ర‌శ్నించ‌డ‌మే కాకుండా , ఆ నిర‌స‌న స‌భ‌లో పాల్గొన‌బోన‌ని ప్ర‌క‌టించారు.. దీంతో అధిష్టానం పెద్ద‌లు కోమ‌టిరెడ్డి తో మాట్లాడి ఆ నిర‌స‌న స‌భ‌ను ఈ నెల 28 వ‌తేదికి వాయిదా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement