Saturday, May 18, 2024

కోమ‌టిరెడ్డి వెంక‌టరెడ్డిని – సోద‌రా అంటూ విషెష్ తెలిపిన రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డికి పీసీసీ ఇచ్చిన నేప‌థ్యంలో అసంతృప్తికి గుర‌య్యారు కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి. కాగా ఆయ‌న‌కి అధిష్టానం కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా కోమటిరెడ్డిని నియమించింది. ఈ మేరకు అధిష్ఠానం నుంచి ప్రకటన వెలువడింది. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.కాగా, పార్టీ సహచరుడు కొత్త బాధ్యతలు అందుకుంటున్న నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణలో పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా నియమితులైనందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు సోదరా అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement