Friday, May 17, 2024

రెండో వన్డేలో శతక్కొట్టిన కేఎల్ రాహుల్

పూణె వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ సెంచరీతో కుమ్మేశాడు. ఇటీవల ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న కేఎల్ రాహుల్ తొలి వన్డేలో హాఫ్ సెంచరీ చేసి తన పరుగుల దాహాన్ని తీర్చుకున్నాడు. ఇక రెండో వన్డేలో పాత రాహుల్‌ను గుర్తుకు తెస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 108 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో కేఎల్ రాహుల్‌కు ఇది ఐదో సెంచరీ. మరో వైపు రిషబ్ పంత్ (40 బంతుల్లో 77, 3×4, 7×6), విరాట్ కోహ్లీ (66) సైతం చెలరేగి ఆడటంతో భారత్ భారీ స్కోరు సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement