Sunday, April 28, 2024

క్రేజీ సాంగ్ కి ‘కీర్తి సురేశ్’ స్టెప్పులు – సూప‌ర్ అంటోన్న నెటిజ‌న్స్

క్రేజీ సాంగ్స్ లిస్ట్ లో కోలీవుడ్ సాంగ్ హ‌ల‌మితి హ‌బిబో కూడా వ‌చ్చి చేరింది. దాంతో ఈ పాటకు సినీ సెలబ్రెటీలతో పాటు, సామాన్యులు కూడా ఫిదా అయ్యారు. రీల్స్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. తాజాగా కేరళ కుట్టి.. మహానటి కీర్తి సురేష్ కూడా హ‌ల‌మితి హ‌బిబో సాంగ్ కు ఓ రేంజ్ లో స్టెప్స్ వేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్, పూజాహెగ్డే లు హీరో హీరోయిన్లుగా నెల్స‌న్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ సినిమా ” బీస్ట్”. ఈ సినిమాకిఅనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలోని హ‌ల‌మితి హ‌బిబో సాంగ్ కు.. సంగీత ప్రేమికులు ఫిదా అయ్యారు. డ్యాన్సింగ్ లవర్స్ లో ఫుల్ జోష్ నింపుతోంది. ఈ పాటకు రీల్స్ చేస్తూ.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇప్పుడు పాటకు మరో హీరోయిన్ స్టెప్స్ వేసింది. కీర్తిసురేష్.. . హిట్ ట్రాక్‌కు ది రూట్‌..టాలెంట్ మేనేజర్ అక్షిత సుబ్ర‌మ‌ణియ‌న్ తో క‌లిసి స్టెప్స్ వేసింది. పంజాబీ డ్రెస్ లో కేరళ కుట్టి.. అక్షితతో చేసిన డ్యాన్స్ కు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement