Friday, May 3, 2024

‘విక్రాంత్ రోణా’ టీజ‌ర్ ని రిలీజ్ చేసిన – మెగాస్టార్ చిరంజీవి, స‌ల్మాన్ ఖాన్

విక్రాంత్ రోణా చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు క‌న్న‌డ స్టార్ హీరో కిచ్చా సుదీప్. ఈ చిత్రానికి అనుప్ భండారి దర్శకత్వం వహించారు. హీరోయిన్ నీతా అశోక్ .. సుదీప్ సరసన నటిస్తోంది. ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అలాగే హింగ్లీష్ లోనూ మొట్టమొదటి సారి సుదీప్ వాయిస్ తో డబ్ చేయడం విశేషం. తాజాగా ‘విక్రాంత్ రోణా’ చిత్ర మేకర్స్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ రిలీజ్ డేట్ టీజర్ ను విడుదల చేశారు. ఈ చిత్రం 3డీలో జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి , హిందీలో సల్మాన్ ఖాన్ అడ్వెంచర్ మూవీ రిలీజ్ డేట్ టీజర్ ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా చిరు ట్విట్టర్ లో సుదీప్ కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ‘చూడటానికి అద్భుతంగా ఉంది. కిచ్చా సుదీప్ నటించిన అడ్వెంచర్ థ్రిల్లర్ రిలీజ్ డేట్ టీజర్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. డైరెక్టర్ అనుప్ భండారికి, చిత్ర యూనిట్ కు నా శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశాడు. అలాగే సల్మాన్ ఖాన్ కూడా చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు చెప్పారు. విక్రాంత్ రోణా మూవీ 3డీలో వస్తుండటం అభినందనీయమని, చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement