Thursday, April 25, 2024

Breaking : క‌రోనా కొత్త‌వేరియంట్ వేగంగా వ్యాప్తి : WHO

కరోనా కొత్తవేరియంట్, ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన ఎక్స్ ఈ వేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. కరోనా బీఏ2 ఒమిక్రాన్ తో పోలీస్తే.. ఎక్స్ ఈ సబ్ వేరియంట్ లో 10 శాతం వృద్ధిరేటు ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ తన ఎపిడెమియోలాజికల్ నివేదికలో వివరించింది. ఒమిక్రాన్ వేరియంట్ వీ1.1.529, బీఏ 1, బీఏ2, బీఏ3తో సహా నాలుగు వేరియంట్లను కలిగి ఉంటుందని తెలిపింది. ఎక్స్ఈ కరోనా వేరియంట్ ను మొదటిసారి యూకేలో జనవరి 19న గుర్తించినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. అప్పట్లో 600 ఎక్స్ ఈ కేసులు బయటపడగా.. ప్రస్తుతం యూఎస్ లో ఎక్స్ఈ కేసులు నమోదవుతున్నాయని పేర్కొంది. ఎక్స్ఈ వంటి రీకాంబినెంట్ వేరియంట్‌లకు సంబంధించిన పబ్లిక్ హెల్త్ రిస్క్‌ను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ చీఫ్ మెడికల్ అడ్వైజర్ సుసాన్ హాప్కిన్స్ చెప్పారు. కాగా.. ఎక్స్ఈ తీవ్రత, దాని లక్షణాలు, వ్యాప్తి చెందే వేగం తదితరాలను గుర్తించేంతవరకూ ఇది ఒమిక్రాన్ వేరియంట్లో భాగంగానే వర్గీకరిస్తామని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement