Monday, April 29, 2024

కేజీఎఫ్2 మ‌రో రికార్డ్ – హిందీలో రూ.400కోట్ల క్ల‌బ్ లోకి చేరిన మూవీ

క‌న్న‌డ హీరో య‌శ్.. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టించిన చిత్రం కేజీఎఫ్2..కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్ కీల‌క‌పాత్ర‌లో న‌టించారు. రావుర‌మేష్, ర‌వీనా టాండ‌న్, ప్ర‌కాశ్‌రాజ్‌ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. ర‌వి బ‌స్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిరగందూర్ నిర్మించారు. హిందీలో రూ.400కోట్ల క్ల‌బ్ లోకి చేరింది కేజీఎఫ్2. సౌత్ నార్త్ అని తేడా లేకుండా విడుద‌లైన ప్ర‌తి భాష‌లో వ‌సూళ్ళ వ‌ర్షాన్ని కురిపిస్తుంది కేజీఎఫ్2. ఇటీవ‌లే ఈ చిత్రం 1100కోట్ల మార్క్‌ను అధిగ‌మించి రికార్డు సృష్టించింది. ఇప్ప‌టికే ఈ చిత్రం అన్ని భాష‌ల్లో బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ చిత్రం స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసింది. తాజాగా ఈ చిత్రం బాలీవుడ్‌లో మ‌రో రికార్డు సాధించింది. బాలీవుడ్‌లో 400కోట్ల క్ల‌బ్‌లో అడుగుపెట్టింది. ‘బాహుబ‌లి-2’ త‌ర్వాత 400కోట్ల క్ల‌బ్‌లో అడుగుపెట్టిన సినిమాగా కేజీఎఫ్ రికార్డు సృష్టించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement