Monday, May 6, 2024

Spl Story: ఆర్డీవో ఆఫీసులో భద్రపరిచిన నగలు, నగదు మాయం.. అసలు కథ ఎంటో తెలుసా?!

కేరళలో ఓ డిఫరెంట్​ ఇష్యూ వెలుగులోకి వచ్చింది. ఓ ఏరియాలో జరిగిన మర్డర్స్​, రోడ్డు యాక్సిడెంట్లకు, అసహజ మరణాలకు సంబంధించి మృతదేహాల నుంచి రికవరీ చేసిన నగదు, నగలను ఆర్డీవో కోర్టు ఆఫీసులోని లాకర్​లో భద్రపరిచారు. చాలామటుకు ఈ కేసులు పరిష్కారం కాకుండా ఉండిపోతున్నాయి. అయితే ఓ మహిళ తన తల్లి మరణంతో ఆమెకు సంబంధించిన నగలను ఇప్పించాలని కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు కూడా ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో ఆ మహిళ ఆర్డీవో ఆఫీసుకు వెళ్లి అధికారులను సంప్రదిస్తే అక్కడ బంగారు నగలకు బదులుగా గిల్టు నగలు కనిపించాయి. దీంతో ఈ విషయమ్మీద పూర్తి దర్యాప్తు చేయాలని కలెక్టర్​ ఆదేశించారు.

2020లో కేరళలోని తిరువనంతపురం జిల్లాలోని శ్రీకార్యంకు చెందిన వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌తో ఇదంతా వెలుగులోకి వచ్చింది. ఆ మహిళ తిరువనంతపురంలోని రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ (RDO)ని ఆశ్రయించింది, ఆర్డీవో అధీనంలో ఉన్న సుమారు 78 గ్రాముల బంగారాన్ని తనకు అప్పగించాలని అభ్యర్థించింది. కాగా, ఈ బంగారం 2011లో చనిపోయిన ఆమె తల్లికి చెందినది.

ఆర్డీవో ఆఫీసు పరిధిలోని ఇతర అసహజ మరణాల మాదిరిగానే వస్తువులను ఆఫీసులోని సేఫ్​లో నిల్వ చేశారు. అన్ని రకాల ఫైల్‌లను క్లియర్ చేసిన తర్వాత స్టోరేజ్ ని తెరవాలని కార్యాలయం నిర్ణయించుకుంది. కానీ, అక్కడ కావాల్సని వస్తువు కనిపించలేదు. దీంతో ఈ ఘటనపై మరింత దర్యాప్తు చేయాలని కలెక్టర్​ ఆదేశించారు. 

అయితే.. మూడు వారాల తర్వాత నిన్న (సోమవారం) కేరళ పోలీసులు ఆర్డీవో ఆఫీసులో బంగారం, నగదు మాయం అయిన ఘటనకు సంబంధించి తిరువనంతపురంలోని కొట్టుకల్ గ్రామానికి చెందిన మాజీ సీనియర్ సూపరింటెండెంట్ శ్రీకంఠన్ నాయర్ (56)ని అరెస్టు చేశారు. 2007నుంచి 2020 మధ్యకాలంలో జరిగిన అసహజ మరణాల కేసుల్లో మృతదేహాల నుంచి పోలీసులు సేకరించి ఆర్డీఓ కోర్టులో భద్రపరిచిన వస్తువులలో భాగమైన 100 సవర్ల బంగారం, 146 గ్రాముల వెండి, 47,500 రూపాయలను నాయర్ కొట్టేశారు.

దీంతో సబ్ కలెక్టర్ ఎంఎస్ మాధవికుట్టి సమగ్ర విచారణ జరిపి జిల్లా కలెక్టర్ నవజ్యోత్ ఖోసాకు నివేదిక సమర్పించారు. 2010-2020 మధ్య కాలంలో వస్తువుల సంరక్షకులందరినీ ఎంక్వైరీ చేశామని పెరూర్‌కడ పోలీసు సీఐ ఆజాద్ అబ్దుల్ కలాం చెప్పారు. 2020లో ఆర్డీవో ఆఫీసులోని లాకర్​కి ఇన్‌ఛార్జ్ గా ఉన్న శ్రీకంఠన్ నాయర్‌కు చెందిన ఖాతాలో అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలను కనుగొన్నారు. కార్యాలయంలో సిబ్బంది సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు అతను కొవిడ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకున్నాడు.

- Advertisement -

దర్యాప్తులో ఈ విషయాన్ని రాబట్టారు. అతను డబ్బుల కోసం అనేక ఆభరణాలను తాకట్టు పెట్టాడు. అతను 2021లో రిటైర్డ్​ కావడానికి ముందు బంగారం స్థానంలో అదే విధమైన బంగారు పూత పూసిన ఆభరణాలను ఉంచాడు ” అని ఎంక్వైరీ చేసిన అధికారి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement