Thursday, May 2, 2024

Spl Story: స్టాక్​ బ్రోకింగ్​లో కార్వీ కహానీ, షేర్​ హోల్డర్స్​కి వేల కోట్ల ఎగనామం.. అసలు కథ ఏంటంటే!

షేర్​ మార్కెట్​, స్టాక్​ బ్రోకింగ్​, ఈక్విటీ, కమోడిటీస్​ ట్రేడింగ్​ ఇదంతా ఓ ఆర్థిక లావాదేవీల యవ్వారం. ఇది తెలియాలంటే ఆర్థిక రంగంలో చాలా నైపుణ్యం ఉండాలే. ప్రస్తుతం బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈ నిఫ్టీ అంటూ మార్కెట్​ వార్తల గురించి వినే ఉంటారు. షేర్​ మార్కెట్​ కుప్పకూలిందనో, ఇవ్వాల షేర్​ మార్కెట్​ లాభాల్లో ఉందనో టీవీ వార్తలు, పేపర్​ న్యూస్​ ద్వారా తెలుసుకునే ఉంటారు. కానీ, దీని లోతుపాతులను అవగాహన చేసుకున్న కొంతమంది మదుపరుల ఆశలను ఆసరాగా చేసుకుని మోసాలకు తెగబడ్డ తీరు చదివి తెలుసుకోవాల్సిందే. ఇదెక్కడో జరిగింది కాదు. మన హైదరాబాద్​ నుంచి ప్రారంభమై, విదేశాలకు పాకి.. అక్కడి నుంచి పెద్దమొత్తంలో డబ్బు కొల్లగొట్టిన కథ ఇది.. పూర్తిగా చదివితేనే ఈ మోసం గురించి తెలుస్తుంది..

– నాగరాజు చంద్రగిరి, ఆంధ్రప్రభ

అది 1983వ సంవత్సరం.. చార్టర్డ్ అకౌంటెంట్‌లుగా పనిచేస్తున్న ఐదుగురు వ్యక్తులు కలిసి హైదరాబాద్‌లో కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (KSBL) పేరుతో తమ సొంత వెంచర్‌ను ప్రారంభించారు. అయితే ఇది అతి తక్కువ కాలంలోనే దేశంలో ఈక్విటీ, కమోడిటీస్ ట్రేడింగ్, డిపాజిటరీ, వెల్త్ మేనేజ్‌మెంట్ వంటి అనేక సేవలను అందించే అతిపెద్ద ఆర్థిక సేవల సంస్థగా ఎదిగింది. అంతే స్పీడుగా బహ్రెయిన్, దుబాయ్, మలేషియా, ఫిలిప్పీన్స్, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలలోనూ తన సేవలను విస్తృతం చేసింది.

ఇక.. 1990ల మధ్య కాలంలో స్టాక్ బ్రోకింగ్, సలహా వ్యాపారాల్లోకి కార్వీ ప్రవేశించింది. అప్పటికే చాలా సంవత్సరాలుగా కార్వీ ఫైనాన్షియల్ కంపెనీలో పెట్టుబడి పెట్టిన మిలియన్ల మంది ఈ సంస్థ రెప్యుటేషన్​ని, దాని నమ్మకాన్ని గమనిస్తూ పెట్టుబడులు పెడుతూ వస్తున్నారు. అయితే.. 2020 నవంబర్​లో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) కార్వీని కొత్త షేర్లు కొనుగోలు చేయకుండా, దేనికీ అంగీకరించకుండా నిషేధం విధించడంతో ఈ కంపెనీ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి.

అసలు కారణం ఏంటంటే?

- Advertisement -

వివిధ రుణ బ్యాంకులకు తమ షేర్లను తాకట్టు పెట్టి దాదాపు 2,300 కోట్ల ఖాతాదారుల నిధులను కార్వీ డిఫాల్ట్ చేసింది. ఇది బ్యాంకు నుండి రుణం తీసుకుని ఆపై అనుబంధ సంస్థలలో అంటే ప్రధానంగా దాని రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెట్టుబడులుగా పెట్టింది. అయితే ఈ మొత్తం ప్రక్రియను అర్థం చేసుకోవాలంటే కొన్ని ప్రాథమిక అంశాలను తెలుసుకుంటేనే ఈ ఆర్థిక లావాదేవీల మోసపు వ్యవహరాం అనేది అర్థమవుతుంది.. 

బ్రోకింగ్ ప్రక్రియ..

ముందుగా మనం షేర్‌పై రుణం తీసుకోవడం అనే కాన్సెప్ట్ ను అర్థం చేసుకోవాలి. X అనే వ్యక్తికి చెందిన డీమ్యాట్ ఖాతా ఉంది. X వారి డీమ్యాట్ ఖాతాలో n షేర్ల సంఖ్య ఉంది. ఇక్కడ బ్రోకర్ అంటే కార్వీ యొక్క డీమ్యాట్ ఖాతా కూడా ఉంటుంది.  ఈ సందర్భంలో కార్వీని పూల్ ఖాతాగా పిలుస్తారు. పూల్ ఖాతా అనేది అన్ని షేర్లను ముందుగా డిపాజిట్ చేసి.. ఆపై విక్రయించే ప్రదేశంగా చెబుతారు. కాబట్టి దానిని విచ్ఛిన్నం చేయడానికి B అనే వ్యక్తి వారి వాటాలను విక్రయించాలని అనుకుంటే,  C కొనుగోలు చేయడానికి రెడీగా ఉంటుంది. ఈ విధానం ప్రకారం B యొక్క షేర్లు మొదట కార్వీ యొక్క పూల్ ఖాతాకు వెళ్లి.. ఆపై C యొక్క డీమ్యాట్ ఖాతాకు బదిలీ అవుతాయి.

మరి ఇదంత సులభమా?

ఇక్కడ X తన వాటాపై రుణం పొందాలనుకుంటున్నట్లు చెప్పించి, ఆ వాటాను కాస్తా కార్వీ పూల్ ఖాతాకు బదిలీ చేస్తారు. కార్వీ అప్పు ఇచ్చే బ్యాంకులకు ఆ వాటాలను బదిలీ చేస్తుంది. బ్యాంకులు దానిని సెక్యూరిటీగా పెట్టుకుని తిరిగి రుణంగా డబ్బుని అందిస్తారు. ఈ డబ్బు పూల్ ఖాతాకు మరియు చివరికి X యొక్క డీమ్యాట్ ఖాతాకు పంపిస్తారు. ఇప్పుడు మార్పిడి మధ్య బ్యాంకులు కొంత శాతం (10%) చొప్పున రుణాలను అందిస్తాయి. కాగా, Karvy అప్పుడు X కి 18% (ఉదాహరణకు) చొప్పున రుణాన్ని అందజేస్తుంది. ఈ వ్యవహారం మొత్తంలో Karvy 8% లాభం పొందుతుందన్నమాట. ఇట్లాగే పెద్ద పెద్ద కంపెనీల్లో బ్రోకింగ్ ప్రక్రియ జరుగుతుంది.

బ్రోకర్లు తమ క్లయింట్‌ల నుండి వాటాలు ఎట్లా తీసుకుంటారు?

ఇట్లాంటి ప్రశ్నలకు ఇక్కడ సమాధానం దొరకదు. కానీ, ఒక మార్గం ఉందంటున్నారు మార్కెట్​ అనలిస్టులు. అది పవర్ ఆఫ్ అటార్నీ (POA)ని ఉపయోగించడంవల్ల ఈజీ అవుతుందని చెబుతున్నారు. క్లయింట్లు తమ షేర్ల గురించి ఉచిత నిర్ణయాలు తీసుకోవడానికి బ్రోకర్లకు ఇచ్చిన సూపర్ పవర్ లేదా అనుమతి ద్వారా ఇట్లాంటి మార్గం ఈజీ అవుతుందంటున్నారు. ఇక.. పవర్​ ఆఫ్​ అటార్నీ (POA)తో బ్రోకర్ ఎప్పుడైనా షేర్‌లను తీసుకోవచ్చు. వాటిని ఎక్కడికైనా విక్రయించవచ్చు. అయితే, అప్పుడు వచ్చిన డబ్బు క్లయింట్ ఖాతాకు తప్పకుండా తిరిగి వస్తుంది.  అది ఇక్కడ నియమంగా ఉంటుంది. కానీ, ఇక్కడ బ్రోకర్ నిజాయితీగా లేకుంటే మాత్రం మోసం జరిగినట్టు భావించాలి.  

సెక్యూరిటీస్​ అండ్​ ఎక్చేంజ్​ ఆఫ్​ ఇండియా (SEBI) సర్క్యులర్ ఏం చెబుతుంది?

పవర్​ ఆఫ్​ అటార్నీ (POA)కి సంబంధించిన అంశాల్లో దుర్వినియోగం పెరుగుతున్న కారణంగా బ్రోకర్లు తమ క్లయింట్‌ల షేర్లను ఉపయోగించకుండా నిషేధిస్తూ సెక్యూరిటీసీ అండ్​ ఎక్చేంజ్​ బోర్డ్​ ఆఫ్​ ఇండియా (SEBI) ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. ఇది 2020 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.

కార్వీ చేసిన ద్రోహం ఏంటంటే..

2020 నవంబర్​లో  కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (KSBL) తన ఆర్థిక చాతుర్యానికి తెరలేపింది. దాని పూల్ ఖాతా ద్వారా నిర్వహణలో లేని డీమ్యాట్ ఖాతాల నుంచి వందల కొద్దీ షేర్లను తీసుకుంది. డోర్మాంట్ డీమ్యాట్ ఖాతాలు చాలా సంవత్సరాలుగా నిర్వహణ లేకుండా ఉన్నాయి. పవర్​ ఆఫ్​ అటర్నీ (POA) సహాయంతో కార్వీ షేర్లను తీసుకుని ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, ఇండస్‌బ్యాంక్ మొదలైన బ్యాంకులకు సెక్యూరిటీగా వాటిని సమర్పించింది. అయితే.. ఇక్కడ బ్యాంకుల నుండి పొందిన రుణ మొత్తాలు మళల్ఈ నిర్వహణలో లేని ఖాతాలకు వెళ్లలేదు. దీనికి బదులుగా కార్వీ తన రియల్​ ఎస్టేట్​ వ్యాపారంలో ఈ రుణాలను పెట్టుబడులుగా పెట్టింది. ఇట్లా కార్వీ సంస్థ మార్కెట్ నిబంధనలను ఉల్లంఘించిందనేది స్పష్టమవుతోంది. ఇట్లా 95,000 డోర్మాంట్ క్లయింట్ ఖాతాలలో 2,300 కోట్లను డిఫాల్ట్ చేసిందని ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్​ (ED) విచారణలో తేలింది.

అయితే.. కార్వీ ఆర్థిక మోసాలకు పాల్పిడిందన్న విషయం వెలుగులోకి రావడంతో కొత్త ఖాతాదారులను తీసుకోకుండా, తదుపరి ట్రేడింగ్ జరపకుండా సెబీ నిషేధం విధించింది. షేర్ల కోసం డిపాజిటరీ అయిన నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌డిఎల్)ని విడిపోయిన ఖాతాదారులకు తక్షణం అమలులోకి వచ్చేలా షేర్లను తిరిగి ఇవ్వాలని సెబి ఆదేశించింది. ఇట్లా దాదాపు 90% షేర్లు వాటాదారులకు తిరిగి వచ్చాయి. కానీ, మిగిలిన 10% వాటా షేర్లు ఏమయ్యాయనేది మాత్రం తెలియకుండా పోయింది.

సెబీ నిర్ణయానికి వ్యతిరేకంగా బ్యాంకుల తిరుగుబాటు..

కేవలం 10% షేర్లతో బ్యాంకులు నష్టాల్లో కూరుకుపోయాయి. అది కార్వీకి ఇచ్చిన రుణ డబ్బును తిరిగి పొందేందుకు ఏమీ లేదు. సెబీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వారు సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (SAT)ని ఆశ్రయించారు. సెక్యూరిటీ అప్పిలేట్​ ట్రిబ్యునల్​ (SAT) అనేది SEBI చట్టంలోని సెక్షన్ 15K యొక్క నిబంధనల ప్రకారం డెవలప్​ చేసిన ఒక చట్టబద్ధమైన సంస్థ. ఇది సెబీ కింద ఆమోదించిన అప్పీళ్లను విచారిస్తుంది. SATకి సిట్టింగ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తి లేదా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి లేదా ఏడు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన సిట్టింగ్ లేదా రిటైర్డ్ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తి అధ్యక్షత వహిస్తారు.

కాగా, SATలో కార్పొరేట్ చట్టం, సెక్యూరిటీల చట్టాలు, ఆర్థిక శాస్త్రం, ఫైనాన్స్ లేదా అకౌంటెన్సీతో వ్యవహరించే సామర్థ్యం ఉన్న సభ్యులు కూడా ఉంటారు. వెంటనే, కార్వీకి వ్యతిరేకంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా ద్వారా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించారు. దీంతో అప్పటి నుంచి ఈ కేసు కొనసాగుతూనే ఉంది. ఈ మధ్య ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED), మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002 కింద 110 కోట్ల రూపాయల విలువైన భూములు, భవనాలు, వాటాలు, నగదు, విదేశీ కరెన్సీ, ఆభరణాల రూపంలో ఉన్న అదనపు ఆస్తులతో పాటు తాత్కాలికంగా అటాచ్ చేసిన ఆస్తులను గుర్తించింది.

కాగా, M/s కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (KSBL), దాని చైర్మన్ కమాండూర్ పార్థసారథి, ఇతరులపై మనీలాండరింగ్ కేసు దర్యాప్తు చేయాలని ఆదేశించింది. గతంలో ఇదే కేసులో సి పార్థసారథి, గ్రూప్ CFO Mr జి హరి కృష్ణను ED అరెస్టు చేసింది. ప్రస్తుతం వారు బెయిల్‌పై ఉన్నారు. ఇక.. కార్వీకి చెందిన రూ. 1984.84 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement