Saturday, May 4, 2024

కర్నాటక మిల్క్ ఫెడరేషన్‌ ఎగ్జామ్‌ పేపర్‌లో.. కాంతార గురించి ప్ర‌శ్న‌

మ‌రో రికార్డ్ సృష్టించింది కాతార మూవీ. . తాజాగా ఈ సినిమా పబ్లిక్‌ ఎగ్జామ్స్ లో ప్రశ్నగా మారడం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తుంది. కన్నడ ప్రభుత్వ ఎగ్జామ్స్ లో ఓ ప్రశ్న కాంతార చిత్రం నుంచి వచ్చింది. కర్నాటక మిల్క్ ఫెడరేషన్‌ ఎగ్జామ్‌ పేపర్‌లో ఈ సినిమా నుంచి ప్రశ్ని వచ్చింది. ఇందులో ఇటీవల విడుదలైన కాంతార చిత్రం దేని ఆధారంగా తెరకెక్కింది అని ప్రశ్నించారు. దీనికి నాలుగు ఆప్షన్లుగా జల్లికట్టు, భూత కోలా, యక్షగాన, దమ్మమి అనే ఆప్షన్లు ఇచ్చారు. క్వచ్ఛన్‌ పేపర్‌లోని ఈ ప్రశ్న క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇది చూసిన హీరోయిన్ సప్తమి గౌడ ఈ పేపర్‌ని తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. బెస్ట్ పార్ట్ ఆఫ్‌ ది క్వచ్ఛన్‌ పేపర్‌ అని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement