Friday, April 26, 2024

క‌మ‌ల్ హాస‌న్ విక్ర‌మ్ చిత్రంలో గెస్ట్ గా – ‘అమితాబ్ బ‌చ్చ‌న్’

లోకేశ్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం విక్ర‌మ్. ఈ చిత్రం విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ సొంత బ్యాన‌ర్ లో నిర్మిత‌మ‌వుతోంది. కాగా ఈ చిత్రంలో విజయ్ సేతుపతి .. ఫహాద్ ఫాజిల్ .. నరేన్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. అయితే ఇప్పటివరకూ ఈ సినిమా టీమ్ సస్పెన్స్ లో ఉంచిన ఒక విషయం తాజాగా బయటికి వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అబితాబ్ బ‌చ్చ‌న్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. సెకండాఫ్ లో ఆయన పాత్ర ఎంట్రీ ఉంటుందట‌. ఇంతవరకూ కమల్ ఎన్నో ప్రయోగాలు చేస్తూ వచ్చారు. ఆ జాబితాలో ఈ సినిమా చేరుతుందని అంటున్నారు. జూన్ 3 వ తేదీన తమిళంతో పాటు తెలుగు .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో కమల్ మరోసారి భారీ హిట్ అందుకుంటారేమో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement