Thursday, April 18, 2024

Yadadri: మహాకుంభ సంప్రోక్షణ.. నేటి కార్యక్రమాలు ఇవే..

యాదాద్రిలోని శ్రీలక్ష్మీ నరసింహా స్వామి ప్రధానాలయ మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా 6వ రోజు ఉదయం శాంతిపాఠం, చతుస్థానార్చన, ద్వార తోరణ ధ్వజకుంభారాదనలు, మూల మంత్రహావనములు, ఏకాశీతి కలశాభిషేకం, నిత్య లఘుపూర్ణాహుతి పూజలు జరుగుతాయి. సాయంత్రం సామూహిక శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం, చతు:స్థానార్చనలు, ధాన్యాధివాసం, నిత్య లఘు పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement