Thursday, May 2, 2024

కమల్​హసన్​ యాక్షన్​ థ్రిల్లర్​.. “విక్రమ్”​ రిలీజ్​ డేట్​ ఫిక్స్​!

క‌మ‌ల్ హసన్​ రాబోయే యాక్షన్ థ్రిల్లర్ మూవీ విక్ర‌మ్.. దీనికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహింస్తుండ‌గా రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్​లో తెరకెక్కుతోంది.. ఈ చిత్రంలో కమల్ హాసన్ తో పాటు ఫ‌హద్ ఫాసిల్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో క‌నిపించ‌నున్నారు.. సౌండ్‌ట్రాక్, ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ని అనిరుధ్ కంపోజ్ చేశారు, సినిమాటోగ్రఫీ గిరీష్ గంగాధరన్, ఎడిటింగ్ ఫిలోమిన్ రాజ్ చేశారు.

కాగా సినిమాకి సంబందించిన ఓ అప్ డేట్ ను రిలీజ్ చేశారు మేక‌ర్స్.. ఈ సినిమాని వేసవి కానుకగా జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లుగా తెలిపారు. విడుదల తేదీతోపాటు.. విక్రమ్ మేకింగ్ వీడియోను సైతం షేర్ చేసింది చిత్రం యూనిట్.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement