Thursday, May 2, 2024

Breaking : వీర జ‌వాన్ ‘నీర‌లా’ సోద‌రి పెళ్ళికి త‌ర‌లివ‌చ్చిన జ‌వాన్లు

వీర జ‌వాన్ నీర‌లా సోద‌రి పెళ్లికి భారీగా జ‌వాన్లు త‌ర‌లివ‌చ్చారు.అమ‌ర జవాను సోద‌రి పెళ్ళికి తోబుట్టువులైయ్యారు తోటి జ‌వాన్లు. ఈ సంఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాయ్ బ‌రేలీలో జ‌రిగింది. పుల్వామాలో జ‌రిగిన టెర్ర‌ర్ దాడిలో అమ‌రుడ‌య్యాడు జ్యోతి ప్ర‌కాశ్ నీర‌లా. 2017, న‌వంబ‌ర్ 18న వీర‌మ‌ర‌ణం పొందాడు. బందిపోర ద‌గ్గ‌ర ఉగ్ర‌వాదుల‌తో భీక‌ర‌పోరు జ‌రిగింది. ఈ పోరులో ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల్ని మ‌ట్టుబెట్టాడు నీర‌లా. శ‌త్రువుల‌పై పోరాడుతూనే తోటి సైనికుల్ని కాపాడాడు నీర‌లా. కాగా అత‌ని సోద‌రి పెళ్ళిలో జ‌వానులంతా క‌లిసి ఈ వేడుక‌ను ఘ‌నంగా జ‌రిపించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement