Friday, May 17, 2024

ఎంజీ జడ్​ ఎస్​ ఈవీ లాంచ్​ చేసిన జోగినపల్లి​.. అద్భుత మైలేజీ అంటున్న కంపెనీ

బ్రాండ్ న్యూ MG ZS EV.. India’s first Pure Electric Internet EV కార్ ను రాజ్యసభ సభ్యుడు సంతోష్​కుమార్​ ఇవ్వాల లాంచ్​  చేశారు.  హైదరాబాద్​ నోవాటెల్​లో ఈ కార్యక్రమం నిర్వహించారు. కాగా, ఎంజి (Morris Garages India)  ప్రస్తుతం 2 విభిన్న వేరియంట్లు, 2 రకాల రంగుల్లో లభ్యమవుతోంది. ఎంజి మోటార్స్ ఇండియా తమ మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో సెకండ్​ జనరేషన్​ ఇది. చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఎస్‌యూవీ డిజైన్ విషయానికి వస్తే దీని ముందు భాగంలో బ్రాండ్ యొక్క సిగ్నేచర్ ఒమేగా ఆకారంలో ఉన్న ఎల్ఈడీ డిఆర్ఎల్ లను ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్‌లతో వస్తుంది.

హెడ్‌ల్యాంప్ క్లస్టర్ మధ్యలో ఒక క్రోమ్-ఫినిష్డ్ కాంకేవ్ గ్రిల్‌ను కలిగి ఉంది. ఇది ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కోసం ఛార్జింగ్ పోర్ట్ ను బహిర్గతం చేయడానికి పైకి వెళ్తుంది. ఈ ఎస్‌యూవీ యొక్క సైడ్, రియర్ ప్రొఫైల్ విషయానికి వస్తే ఇది చాలా స్పోర్టి ఇంకా ప్రీమియం లుక్‌తో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో ఫ్లేర్డ్ వీల్ ఆర్చెస్, హౌసింగ్ 17- ఇంచెస్ ప్రత్యేకంగా రూపొందించిన అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వెనుక భాగం ఎల్‌ఈడీ టైల్ లైట్స్ కలిగి ఉంటాయి. రియర్ ప్రొఫైల్‌లో సైడ్ రిఫ్లెక్టర్ల చుట్టూ క్రోమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, సిల్వర్ స్కఫ్ ప్లేట్‌తో వస్తుంది. ఎంజి జెడ్ఎస్ ఈవి ఇంటీరియర్ విషయానికి వస్తే ఇది ఆకర్షణీయమైన డాష్‌బోర్డ్ లేఅవుట్‌తో వస్తుంది. కేబిన్ పూర్తిగా బ్లాక్-అవుట్ చేయబడింది. డాష్‌బోర్డ్ లోని సిల్వర్ ఎలిమెంట్స్ కొద్దిగా డిఫరెంట్​గానే ఉంటాయని చెప్పవచ్చు. మధ్యలో ఉన్న పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డాష్‌కు ఫ్లష్‌లో ఉంటుంది, ఇతర ప్రత్యేక ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది.

ఇది ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కావడంతో ఎంజి జెడ్‌ఎస్ ఈవి బోనెట్ కింద 3 ఫేస్ పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటారుతో వస్తుంది. ఎకో, నార్మల్, స్పోర్ట్ మోడ్స్. ఎంజి జెడ్‌ఎస్ ఈవి 8.3 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకుంటుందని ఎంజి మోటార్స్ పేర్కొంది. మైలేజ్ విషయానికి వస్తే ఇది ఒకసారి చార్జ్ (ARAI- సర్టిఫైడ్) పై గరిష్టంగా 340 కిలోమీటర్ల వరకు వస్తుంది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement