Sunday, April 28, 2024

ఇంగ్లాండ్ కెప్టెన్సీకి జో రూట్ గుడ్ బై

ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్సీకి జో రూట్ గుడ్ బై చెప్పారు. ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టు 0-1 తేడాతో ఓటమిపాలైంది. కరేబియన్ జట్టు చేతిలో ఓడాక.. రూట్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. 2017లో కుక్ రాజీనామా తర్వాత రూట్‌ను ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్‌గా నియమించారు. 2018లో అతడి సారథ్యంలోని ఇంగ్లిష్ జట్టు సొంత గడ్డ మీద భారత్‌ను 4-1 తేడా ఓడించింది. 2019-20లో సౌతాఫ్రికా గడ్డ మీద సిరీస్‌ను 3-1 తేడాతో గెలుచుకుంది. కానీ ఆస్ట్రేలియాతో చేతిలో 0-4 తేడాతో చిత్తుగా ఓడింది. గత వేసవిలో న్యూజిలాండ్, భారత్ చేతుల్లో ఇంగ్లిష్ జట్టు ఓటమి చవి చూసింది. రూట్ నాయకత్వంలో ఆడిన చివరి 17 టెస్టుల్లో ఇంగ్లాండ్ జట్టు కేవలం ఒకే విజయాన్ని అందుకుంది.


31 ఏళ్ల రూట్ ఇంగ్లాండ్‌కు టెస్టుల్లో అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. అతడి సారథ్యంలో ఇంగ్లిష్ జట్టు 27 టెస్టుల్లో విజయం సాధించింది. మైకెల్ వాన్, కుక్, ఆండ్రూ స్ట్రాస్ కంటే మిన్నగా రూట్ లాంగ్ ఫార్మాట్లో ఇంగ్లాండ్ జట్టును ముందుకు నడిపించాడు. ఇంగ్లాండ్ తరఫున రూట్ తర్వాత టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రూట్ రికార్డ్ క్రియేట్ చేశాడు. కెప్టెన్‌గా రూట్ 14 సెంచరీలు బాదాడు. అత్యధిక పరుగులు చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్‌ రూట్ (5295) కావడం విశేషం.యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఘోర ఓటమితోపాటు.. వెస్టిండీస్ చేతిలో ఇంగ్లాండ్ జట్టు ఓడిపోయాక.. రూట్ కెప్టెన్సీ పగ్గాలు వదిలేయాలనే డిమాండ్ తీవ్రమైంది. దీంతో భార్యా పిల్లలతో కలిసి కరేబియన్ దీవుల నుంచి స్వదేశం చేరుకున్న తర్వాత రూట్ కెప్టెన్సీని వదిలేస్తున్నట్లు ప్రకటించాడు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలగడం అనేది తన కెరీర్లో తీసుకున్న కఠిన నిర్ణయాల్లో ఒకటన్న రూట్.. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు, సన్నిహితులతో చర్చించానని తెలిపాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement