Monday, April 29, 2024

జ‌య‌మ్మ పంచాయితీ నుండి – ఎమోష‌నల్ సాంగ్ రిలీజ్

స్టార్ యాంక‌ర్ సుమ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం జ‌య‌మ్మ పంచాయితీ. ఈ చిత్రం నుండి “గొలుసు కట్టు గోసలు” పాటను తాజాగా విడుదల చేశారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, చారు హరిహరన్ పాడిన ఈ పాట చాలా ఎమోషనల్ గా ఉంది. సాంగ్ ను సరిగ్గా వింటే సినిమా మెయిన్ స్టోరీ అంతా ఇందులోనే ఇమిడి ఉందనిపిస్తోంది. చైతన్య ప్రసాద్ సాహిత్యంతో రూపొందిన ఈ సాంగ్ మనసుకు హత్తుకునేలా ఉంది. మరి వెండితెరపై ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై బలగ ప్రకాష్ నిర్మిస్తున్న ఈ విలేజ్ డ్రామాకి ఎడిటర్ గా రవితేజ గిరిజాల బాధ్యతలు చేపట్టారు. మ‌రి సుమ‌కి ఈ చిత్రం ఏ మేర‌కు విజ‌యాన్ని అందిస్తుందో చూడాలి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement