Saturday, July 13, 2024

Jammu Kashmir: ఎన్ కౌంట‌ర్ లో ముగ్గురు ముష్క‌రుల హ‌తం

జమ్ముకశ్మీర్ రాష్ట్రం అనంతనాగ్​ జిల్లా పహల్గాం అటీవీ ప్రాంతంలో జ‌రిగిన ఎన్ కౌంట‌ర్ లో ముగ్గురు పుష్క‌రులు హ‌త‌మ‌య్యారు. అక్క‌డ‌ ముష్కరులు నక్కి ఉన్నారనే పక్కా సమాచారంతో ఆ ప్రాంతంలో బ‌ల‌గాలు నిర్భంద తనిఖీలు నిర్వహించాయి. వీరిని చూసి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థకు చెందిన‌ ముగ్గురు ముష్కరులను బలగాలు మట్టుబెట్టాయి. వీరిలో అశ్రఫ్​ మోల్పీ అనే పాత తీవ్రవాది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అమర్​నాథ్ యాత్ర మార్గంలో జరిగిన ఎన్​కౌంటర్ తమకు అతిపెద్ద విజయమ‌ని కశ్మీర్​ ఐజీపీ విజయ్​ కుమార్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement