Saturday, April 27, 2024

కొమురం భీముడో ఫుల్ వీడియో సాంగ్

ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం ఆర్ ఆర్ ఆర్ విడుద‌లై న‌ల‌భై రోజుల దాటినా కొన్ని చోట్ల మంచి వ‌సూళ్ళే వస్తున్నాయి. చ‌ర‌ణ్‌, తార‌క్‌ల న‌ట‌న‌కు సినీప్ర‌ముఖులు సైతం జైజైలు కొట్టారు. ఇండియాలో వ‌రుస‌గా రెండు సార్లు 1000కోట్ల క్ల‌బ్‌లో చేరిన ద‌ర్శ‌కుడిగా రాజ‌మౌళి రికార్డు సృష్టించాడు. ఎమ్ఎమ్ కీర‌వాణి స్వ‌ర ప‌రిచిన బాణీలు ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. విడుద‌ల‌కు ముందే ఈ పాటలు యూట్యూబ్‌లో మిలియ‌న్ల వ్యూస్‌ను సాధించాయి. ఇప్ప‌టికే ఈ చిత్రంలోని ‘దోస్తీ’, ‘నాటునాటు’, ‘కొమ్మ ఉయ్యాల’ వీడియో సాంగ్స్ విడుద‌ల‌వ‌గా ప్రేక్ష‌కుల నుంచి విశేష స్పంద‌న వ‌చ్చింది. ఈ క్ర‌మంలో తాజాగా మేక‌ర్స్ ‘కొమురం భీముడో’ వీడియో సాంగ్‌ను విడుద‌ల చేశారు. ఈ పాట‌లో ఎన్టీఆర్ ఇచ్చిన ఎక్స‌ప్రేష‌న్స్ తాను ఎంత గొప్ప ఆర్టిస్టు అని తెలుస్తుంది. సుద్ధాల ఆశోక్ తేజ లిరిక్స్ ఆయుధంతో కాదు పాట‌తో కూడా ప్ర‌జ‌ల్లో ధైర్యాన్ని నింప‌వ‌చ్చు అనే విధంగా ఉన్నాయి. కాల‌భైర‌వ గాత్రంతో ఈ పాట‌కు ప్రాణం పోశాడు. ఈ పాట మీకోసం.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement