Friday, May 3, 2024

జాక్వెలిన్ అంటే ఫుల్ క్రేజ్.. ఒక్కో పాటకు 5కోట్ల డీల్!

బాలీవుడ్  హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తెలియని వారు ఉండరు.. తన అందచందాలు, డ్యాన్సులతో అందరినీ మెస్మరైజ్ చేస్తుంది ఈ బ్యూటీ. అయితే ఈ మధ్యనే తన రేంజ్ పెంచేసినట్టు వార్తలొస్తున్నాయి. ఈ మధ్య దేశీ మ్యూజిక్ చేపట్టిన సరికొత్త ప్రాజెక్టుకు సైన్ చేసింది ఈ అమ్మడు. కాగా, దుబాయ్‌లోని అందమైన ప్రదేశాల్లో ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. ఈ ఆల్బమ్ లో డ్యాన్స్ చేయడానికి ఒక్కో పాటకు ఆమె 4 నుంచి -5కోట్లు తీసుకున్నట్టు సమాచారం. VikrantRona లెక్కనే అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న వారిలో తను కూడా ఉందని బిటౌన్ కోడై కూస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement