Friday, May 3, 2024

మళ్లీ యథాతథమేనా.. నేటి నుంచి ఆర్బీఐ ద్రవ్యపరపతి భేటీ

న్యూఢిల్లీ : కొత్త కరోనా వైరస్‌ వేరియెంట్‌ ఒమిక్రాన్‌ దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకున్న నేపథ్యంలో కీలకమైన రెపో, రివర్స్‌ రెపో రేట్లను ఆర్బీఐ యథాతథంగా కొనసాగించే అవకాశముందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరింత అనుకూల సమయంలో వడ్డీ రేట్ల మార్పు విషయాన్ని ఆర్బీఐ పరిశీలించొచ్చని. ముఖ్యంగా ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యాన్ని పక్కన పెట్టాల్సిన పనిలేకుండా వృద్ధికి ఊతమివ్వనుందని ఆర్థిక నిపుణులు చెబుతన్నారు. కాగా గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ సారధ్యంలో ఆర్బీఐ ద్వైమాసిక మోనిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) డిసెంబర్‌ 6 – 8 తేదీల మధ్య జరగనుంది. అక్టోబర్‌లో జరిగిన భేటీలో వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించేందుకు కమిటీ నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఈ భేటీలో రివర్స్‌ రెపో పెంచితే కంగారుపడినట్టేనని ఎస్‌బీఐ రీసెర్చ్‌ రిపోర్ట్‌ విశ్లేషించింది. ఒమిక్రాన్‌ వేరియెంట్‌కు సంబంధించి అంతా అనిశ్చితి పరిస్థితులే నెలకొన్నాయని కోటక్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ పేర్కొంది. వడ్డీరేట్లపై నిర్ణయాత్మకంగా వ్యవహరించే ముందు ఆర్బీఐ కొంతకాలం ఎదురుచూడడం మంచిదని సూచించింది. ఆర్బీఐ ద్రవ్య విధాన భేటీలో వడ్డీ రేట్లను నామమాత్రంగా పెంచొచ్చని భావిస్తున్నామని ప్రోపర్టీ కన్సల్టెంట్‌ అనారాక్‌ పేర్కొంది. అయితే ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థాయిలో వృద్ధి చెందుతున్న తరుణంలో దాపురించిన కరోనా కొత్త వేరియెంట్‌ ఒమిక్రాన్‌ను దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ నిర్ణయాలు తీసుకుంటుందని భావిస్తున్నట్టు చెప్పారు. కనిష్ఠ వడ్డీ రేట్లతో గృహ రుణదారులు మరికొంతకాలం కనిష్ఠ వడ్డీ ప్రయోజనాలను పొందే అవకాశం కలుగుతుందని అనారాక్‌ చైర్మన్‌ అనుజ్‌ పూరీ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement