Wednesday, May 1, 2024

WGL | సొంత తమ్ముడిని చంపేసేంత ప‌గ‌.. భూ తగాదాలే కారణమా?

అన్నదమ్ముల మధ్య కొంతకాలంగా భూ తగాదా నడుస్తోంది. ఇరువురి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో భేదాభిప్రాయాలు పొడచూపాయి. సమస్య పరిష్కారానికి చొరవ చూపకపోవడంతో తమ్ముడిపై కక్ష పెంచుకున్నాడు. అదును కోసం చూస్తున్న అన్న, తన తమ్ముడైన శ్రీకాంత్ ను శనివారం రాత్రి ఇంటికి పిలిచి పథకం ప్రకారం దాడి చేసి హతమార్చాడు. ఈ ఘటన వరంగల్ నగరంలోని ఉర్సు కరీమాబాద్ లో జరిగింది. ముందుగా తెచ్చుకొని పెట్టుకొన్న పెట్రోల్ ని తమ్ముడిపై పోసి తగులబెట్టే యత్నం చేశాడు. వీలు పడక పోవడంతో బండరాయితో కొట్టి చంపాడు. మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement