Saturday, May 4, 2024

అణు చర్చలు జరుగుతుండగానే.. అంతరిక్ష ప్రయోగం చేపట్టిన ఇరాన్..

2015 అణు ఒప్పందాన్ని రివ్యూ చేస్తుండగానే.. కొన్ని దేశాలను చికాకు పెట్టేలా ఇరాన్ ప్రవర్తిస్తోంది. కొత్తగా అంతరిక్ష ప్రయోగాన్ని నిర్వహించినట్లు గురువారం ప్రకటించింది. ” మూడు రీసెర్చ్ కార్గోలను సిమోర్గ్ ఉపగ్రహ లాంచర్ అంతరిక్షంలోకి తీసుకువెళ్లనుంది” అని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అహ్మద్ హొస్సేని స్టేట్ టెలివిజన్‌తో చెప్పారు. “ఈ ప్రయోగానికి కావాల్సిన ఏర్పాట్లు జరిగాయి” అని హోస్సేనీ పరిశోధనకు సంబంధించిన వివరాలను తెలిపారు. కాగా, ఫిబ్రవరిలో ఇరాన్ 220 -కిలోగ్రాముల (1,100-పౌండ్) పేలోడ్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు.

అయితే.. ఈ ప్రయోగం గురించి యునైటెడ్ స్టేట్స్ ఆందోళన వ్యక్తం చేసింది, ఇరు దేశాలు దౌత్యానికి వస్తున్న తరుణంలో ఇట్లాంటి పరీక్షలు చేయొద్దని సూచిస్తోంది. కాగా, ఈ పరీక్ష ఇరాన్ యొక్క బాలిస్టిక్ క్షిపణి సాంకేతికతను పెంచుతుందని అమెరికా పేర్కొంది.  ఇరాన్ తన మొదటి సైనిక ఉపగ్రహాన్ని ఏప్రిల్ 2020లో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అప్పుడు కూడా వాషింగ్టన్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇట్లాంటి ఉపగ్రహ ప్రయోగాలు అణు వార్‌హెడ్‌ను తీసుకెళ్లగల బాలిస్టిక్ క్షిపణులలో ఉపయోగించే సాంకేతికతలతో ఉంటాయన్న కారణంగానే పాశ్చాత్య దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కానీ, ఇరాన్ తన అంతరిక్ష కార్యక్రమం ద్వారా పౌర, రక్షణ ప్రయోజనాల కోసం మాత్రమేనని.. అణు ఒప్పందాన్ని లేదా మరే ఇతర అంతర్జాతీయ ఒప్పందాలను తాము ఉల్లంఘించడం లేదని చెబుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement