Sunday, May 5, 2024

వర్క్‌ ఫ్రం హోం తో భారీగా పెరిగిన నెట్ వినియోగం..

డిజిటల్‌ ఇండియా బాటలో గ్రేటర్‌ హైదరాబాద్ ప్రజలు పరుగులు పెడుతున్నారు. ప్రస్తుతం కరోనా విజృంభణ కారణంగా మహానగరం పరిధిలోని వందలాది ఐటీ, బీపీఓ, కేపీఓ కంపెనీలు వేలాది మందికి వర్క్‌ ఫ్రం హోంకు అనుమతించాయి. మరోవైపు మెజారిటీ నగరవాసులు అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. దీంతో ఇంటర్నెట్‌ వినియోగం అధికమైంది. ఉద్యోగులు, విద్యార్దులు, గృహిణులు అనే తేడా లేకుండా అందరికి నెట్ వినియోగం తప్పని సరైంది. సాధారణ స్పీడ్‌ ఉండే ఇంటర్నెట్‌ కంటే, ఇప్పుడు హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ వినియోగానికే గ్రేటర్‌సిటేజన్లు మొగ్గుచూపుతున్నట్లు టెలికాం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) తాజా అధ్యయనంలో తేలింది.

దేశవ్యాప్తంగా డిజిటల్‌ ఇండియా శకం సృష్టించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు 2021 చివరి నాటికి దేశంలో సుమారు 82 కోట్ల మంది ఇంటర్నెట్‌ను వినియోగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న విషయం విదితమే. ఇదే తరుణంలో మహానగరం కూడా ఇదే ట్రెండ్ నెలకొన్నట్లు పేర్కొంది. ఇక నెట్‌వినియోగానికి వస్తే గ్రేటర్ పరిధిలో సుమారు 50 లక్షలమంది నెటిజన్లు ఉన్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. మన దేశంలోని చెన్నై, బెంగళూరు, కోల్కతా, ఢిల్లీ వంటి మహనగరాల్లో కూడా ఇంతే స్థాయిలో నెటిజన్లు ఉన్నట్లు ఈ అధ్యయనం అంచనా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement