Thursday, May 2, 2024

దసరాకి కేజీఎఫ్2 రిలీజ్ ?

రాక్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కేజిఎఫ్ 2. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీ కేజిఎఫ్ కు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నిర్మాణం కూడా పూర్తయింది. కానీ కరోనా కారణంగా రిలీజ్ డేట్ కూడా వాయిదా పడుతూ వస్తోంది. నిజానికి ఈ సినిమా జూలై 16న విడుదల చేయబోతున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించారు. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ మళ్ళీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పూర్తి స్థాయిలో థియేటర్స్ ఓపెన్ అవ్వడానికి ఇంకా చాలా సమయం పట్టేలా కనిపిస్తుంది. పరిస్థితులు అన్నీ కూడా అనుకూలిస్తే అక్టోబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట దర్శక నిర్మాతలు. ఇప్పటికే చాలావరకు రిలీజ్ కానీ సినిమాలు దసరా టార్గెట్ చేసుకొని బరిలో దిగబోతున్నాయి. ఇప్పుడు కేజీఎఫ్2 కూడా దసరాకి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఇదే విషయంపై త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement