Thursday, October 10, 2024

Covid-19: దేశంలో కొత్తగా 2,487 మందికి కరోనా

దేశంలో కరోనా మహమ్మారి తగ్గడం లేదు. అయితే, నిన్నటితో పొల్చితే తాజా కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్.. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,487 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,31,21,599కు చేరాయి. ఇందులో మొత్తం 4,25,76,815 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. గత 24 గంటల్లో కొత్తగా 13 మంది కరోనాతో మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,24,214కి చేరింది. అదే సమయంలో 2,878 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 17,692 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 0.59 శాతంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement