Saturday, April 20, 2024

గంగమ్మ అమ్మవారికి సారె సమర్పించిన ఎస్పీ దంపతులు

తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లికి ఆదివారం పోలీస్ విభాగం తరఫున తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డి, పోలీస్ యంత్రంగం, వారి కుటుంబ సభ్యలు పట్టు చీర, సారె సమర్పించారు. స్థానిక ఎస్పీ క్యాంప్ కార్యాలయం నుంచి డప్పులు, సన్నాయి, డప్పు వాయిద్యాల మధ్య భారీ వూరేగిపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, నగర డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ స్వాగతించారు. ఆలయం వద్ద వారికి పాలక మండలి చైర్మన్ కట్టా గోపీ యాదవ్, అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఈ సందర్భంగా మీడియాతో ఎస్పీ పరమేశ్వర రెడ్డి మాట్లాడారు. గంగమ్మ జాతర చరిత్రలో తొలి సారి పోలీస్ విభాగం తరఫున గంగమ్మ తల్లికి పోలీస్ కుటుంబాలు పట్టు చీర, సారె సమర్పించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ప్రతిష్టాత్మకంగా గంగమ్మ జాతర నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. జాతరలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయం వద్ద తగిన చర్యలు చేపట్టామని వివరించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement