Wednesday, May 1, 2024

India Corona: దేశంలో కరోనా ఉగ్రరూపం.. కొత్తగా 2.71 లక్షల కేసులు

దేశంలో క‌రోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. రోజువారీ కేసులు విజృంభిస్తున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజాగా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,71,202 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. వైరస్తో 314 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,86,066కి పెరిగింది. అదేసమయంలో క‌రోనా నుంచి 1,38,331 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కోలుకున్న వారి సంఖ్య‌ 3,50,85,721కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 15,50,377 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 3,71,22,164 కరోనా కేసులు నమోదైయ్యాయి.

మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 7,743 ఒమిక్రాన్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల వెలుగు చూశాయి.

దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కూడా శరవేగంగా కొనసాగుతోంది. శనివారం 66,21,395 డోసులు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,56,76,15,454కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement