Thursday, May 2, 2024

కొత్త‌గా 9,923క‌రోనా కేసులు

గ‌డిచిన 24గంట‌ల్లో 9,923 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. నిన్నటితో పోలిస్తే 22.4శాతం కేసులు తగ్గాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,33,19,396 చేరింది. మరో 17 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య 5,24,890కు పెరిగింది. కొత్తగా 7,293 మంది రోగులు డిశార్జి అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,27,15,193కి చేరింది. ప్రస్తుతం దేశంలో 79,313 యాక్టివ్‌ కేసులున్నాయని కేంద్రం తెలిపింది. రికవరీ రేటు 98.61శాతం ఉందని, రోజువారీ పాజిటివిటీ రేటు 2.55శాతంగా ఉందని వివరించింది.

తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కేరళలో 2,786 కేసులు, మహారాష్ట్రలో 2,354 కేసులు, ఢిల్లీలో 1,060 కేసులు ఉన్నాయి. తమిళనాడులో 686 కేసులు, హర్యానాలో 684 కేసులు నమోదైన మొదటి ఐదు రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ఈ ఐదు రాష్ట్రాల నుంచే 76.28 శాతం కొత్త కేసులు రికార్డయ్యాయి. మరో వైపు దేశంలో టీకాల పంపిణీ కొనసాగుతున్నది. గత 24 గంటల్లో 13,00,024 డోసులు వేయగా.. ఇప్పటి వరకు 1,96,32,43,003 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement