Monday, April 29, 2024

Covid-19 vaccine: దేశంలో మరో కొత్త వ్యాక్సిన్..’కోవోవాక్స్‌’ వినియోగానికి అనుమతి!

భారత్ లో కరోనా కట్టడికి మరో కొత్త వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం కోవిషీల్డ్, కోవ్యాక్సిన్ వినియోగంలో ఉన్నాయి. తాజాగా దేశంలో మరో రెండు కొవిడ్‌ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి ఆమోదం లభించింది. దేశంలో ఒమిక్రాన్ భయాందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఇదీ ఉపశమనం ఇచ్చే వార్త. పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారుచేసిన ‘కొవొవాక్స్‌’, బయోలాజికల్‌-ఈ తయారు చేసిన కార్బెవాక్స్‌కు అనుమతులు మంజూరు చేయాలని… కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో) నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో వినియోగం కోసం కోవోవాక్స్‌ను మార్కెట్‌‌లోకి తీసుకురావడం కోసం అనుమతి కోరుతూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు అక్టోబర్‌లోనే సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ)‌లో దరఖాస్తు చేశారు. ఈ టీకాపై చేపట్టిన 2, 3 దశల క్లినికల్‌ పరీక్షల ఫలితాలకు సంబంధించిన డేటాను జతచేసింది.

అమెరికాకు చెందిన నొవావాక్స్‌ నుంచి టీకా సాంకేతికతను పొందిన ఎస్‌ఐఐ ‘కొవొవాక్స్‌’ కొత్త టీకాను ఉత్పత్తి చేసింది. కోవోవాక్స్ టీకా అత్యవసర వినియోగ అనుమతి దరఖాస్తుపై రెండోసారి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌కు చెందిన కొవిడ్-19 సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ (ఎస్‌ఈసీ) సమీక్ష జరిపింది. ఈ సందర్భంగా కోవోవాక్స్‌కు అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement