Wednesday, May 15, 2024

India Corona: దేశంలో కొత్త కేసులు ఎన్నంటే..

దేశం​లో రోజువారి కరోనా కేసుల తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,906 కరోనా కేసులు వెలుగు చూశాయి. వైరస్ తో మరో 561 మంది మృతి చెందగా.. నిన్న ఒక్కరోజే 16,479 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసులు సంఖ్య 3,41,75,707కి చేరగా.. ఇందులో 3,35,48,605 మంది బాధితులు కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1,72,594 కేసులు యాక్టివ్ గా ఉండగా.. మొత్తం 4,54,269 మంది కరోనాతో మరణించారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇటీవల వంద కోట్ల మందికి వ్యాక్సిన్ పంపిణీని పూర్తి చేశారు. దీంతో దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు మొత్తం 1,02,10,43,258 మందికి కరోనా టీకా వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ లోకి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఆ 15 మంది ఎవరు?

Advertisement

తాజా వార్తలు

Advertisement