Tuesday, May 21, 2024

పెరిగిన బంగారం ధ‌ర : ఎంతంటే

నేటి బంగారం ధ‌ర కాస్త పెరిగింది. మ‌రి నేటి బంగారం ధ‌ర‌లు ఎంతెంత పెరిగాయో తెలుసుకుందాం.. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర పైకి కదిలింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.320 పెరిగింది. దీంతో బంగారం ధర రూ.49,420కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.300 పెరుగుదలతో రూ.45,300కు ఎగసింది. బంగారం ధర పైకి కదిలితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. సిల్వర్ ధర మరింత పైపైకి చేరింది. రూ.500 పెరిగింది.

దీంతో కేజీ వెండి ధర రూ.65,100కు ఎగసింది. వెండి పట్టీలు, కడియాలు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. ఔన్స్‌కు 0.04 శాతం పైకి కదిలింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1798 డాలర్లకు చేరింది. వెండి రేటు మాత్రం నేలచూపులు చూసింది. వెండి ధర ఔన్స్‌కు 0.12 శాతం తగ్గుదలతో 22.45 డాలర్లకు క్షీణించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement