Saturday, October 12, 2024

లాక్ డౌన్: ముంబైలో తగ్గిన కరోనా మహమ్మారి!

కరోనా విజృంభణతో అల్లాడుతున్న మహారాష్ట్రలో కేసుల సంఖ్య కొంచం తగ్గాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తుండటంతో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.  ఆదివారం ముంబైలో కొత్తగా 3,629 కేసులు నమోదు అయ్యాయి. అయితే ఒక్కరోజే 79 మంది మృతి చెందారు. లాక్‌ డౌన్‌ ఆంక్షలు పకడ్భందీగా అమలు చేయడంతో ముంబైలో కరోనా కేసులు 3 నుంచి 4 వేలలోపు మాత్రమే నమోదవుతున్నాయి.

ముంబైలో ఇప్పటివరకు 6,55,997 మంది కోవిడ్‌ బారినపడగా.. మొత్తం 13,294 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో కొత్తగా 56,647 కోవిడ్‌ కేసులు నమోదయినట్లు అధికారులు ఆదివారం ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 47,22,401కి చేరుకుంది. అలాగే ఆదివారం ఒక్కరోజే 51,356 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 39,81,658కి పెరిగింది. కొత్తగా 669 కరోనా మరణాలు సంభవించగా.. రాష్ట్రంలో మొత్తం కోవిడ్‌ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 70,284కు చేరుకుంది.   రికవరీ రేటు 84.31 శాతానికి పెరిగిందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 6.68 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని చెప్పారు.

ఇక, కరోనా టీకాలను ప్రస్తుతానికి 18 నుంచి 45 ఏళ్ల లోపు వయసున్న వారికే ఇవ్వాలని నిర్ణయించామని బీఎంసీ అధికారులు తెలిపారు. ముంబైలో కరోనా టీకాల కోసం 45 ఏళ్లు పైబడిన వారు రావొద్దని సూచించారు. నగరంలో వ్యాక్సిన్ కొరత అధికంగా ఉందని, టీకాలు సరఫరా కాగానే, మరింత మందికి ఇస్తామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement