Thursday, April 25, 2024

మమత విజయంపై రామ్ గోపాల్ వర్మ వీడియో

పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించారు. ఈ విజయం పై రాంగోపాల్ వర్మ స్పందించారు. మమత విజయం పై వర్మ తన క్రియేటివిటీకి పదును పెట్టి ఓ వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఓ షార్ట్ వీడియోను షూట్ చేయించి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనికి ‘దీదీ ఓ దీదీ’ అని పేరు పెట్టారు. ఇందులో మమతా బెనర్జీతో పాటు నరేంద్ర మోదీ, అమిత్ షాలు నటించారని కామెంట్ చేశారు. ఇక ఈ వీడియోలో ఓ హ్యాండ్ బ్యాగ్ తో ఒంటరిగా వస్తున్న యువతిపై, వెనుక నుంచి ఓ హై ఎండ్ బైక్ పై వచ్చిన ఇద్దరు అటకాయిస్తారు. ఈలోగా పారిపోయినట్టుగా పరిగెత్తే ఆ యువతి, తన చేతిలోని బ్యాగ్ ను దూరంగా విసిరేస్తుంది. వెంటనే ఆ ఇద్దరు బ్యాగ్ కోసం పరిగెత్తగా, వారు తెచ్చిన బైక్ ను ఎంచక్కా నడుపుకుంటూ వెళ్లిపోతుందా యువతి. ఈ వీడియోను చూసిన బీజేపీ ఫాలోవర్స్ వర్మపై విరుచుకుపడుతున్నారు. మిగతా వారు మాత్రం వర్మ క్రియేటివిటీని పొగడుతున్నారు.

https://twitter.com/RGVzoomin/status/1388823551046680577?s=19
Advertisement

తాజా వార్తలు

Advertisement