Thursday, April 25, 2024

Weather Alert: తెలంగాణలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో ‘ఎల్లో అలర్ట్’ జారీ!

తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగండ్ల వాన, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని తెలిపింది. ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. కర్ణాటక నుంచి రాయలసీమ, తెలంగాణ మీదుగా ఛత్తీస్ గఢ్ వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తున ద్రోణి కొనసాగుతోంది. ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. రాబోయే మూడ్రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరించింది. దక్షిణ, తూర్పు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తెలంగాణలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగాం, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో వాతావరణ శాఖ మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

పలు జిల్లాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఇటీవ‌ల ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురియ‌డంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అకాల వ‌ర్షాల‌కు పెద్ద ఎత్తున పంట న‌ష్టం వాటిల్లింది. మూడ్రోజులుగా పడుతున్న వడగండ్ల వానలకు వరంగల్, కరీంనగర్, వికారాబాద్, ఖమ్మం, నిజామాబాద్ తదితర జిల్లాల్లో తీవ్రంగా పంటనష్టపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement