Thursday, April 25, 2024

Box Office: ‘బంగార్రాజు’ తొలి రోజు వసూళ్లు ఎంతంటే…

కింగ్ నాగార్జున, నాగచైతన్య నటించిన ‘బంగార్రాజు’ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ నిన్న రిలీజ్ అయింది. ‘సోగ్గాడే చిన్నినాయనా’కి సీక్వెల్ గా రూపొందిన ఈ మూవీకి మంచి టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.  నాగార్జున అక్కినేని, రమ్యకృష్ణ, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1200 స్క్రీన్లలో విడుదలైంది.

గతంలో సంక్రాంతి బరిలో ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమా రిలీజ్ అయ్యి.. ఘన విజయం సాధించి అత్యధిక వసూళ్లను రాబట్టింది. తాజాగా ‘బంగార్రాజు’ కూడా సంక్రాంతికి విడుదలైంది. ‘బంగార్రాజు’ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. నైజామ్ లో తొలి 3.1 కోట్ల గ్రాస్ ను, 1.73 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఏపీలో సినిమా టికెట్ల ధరలు తగ్గించినా.. మంచి ఓపెనింగ్సే వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.5 నుంచి 7.5 కోట్ల  వరుకు వసూలు చేసిందని అంటున్నారు. ఈ సినిమాకి వచ్చిన టాక్ రావడం, ఇతర పెద్ద సినిమాలు లేకపోవడంతో వసూళ్లు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement