Saturday, May 11, 2024

Rain Alert: తెలంగాణకు వర్ష సూచన.. రాబోయే రెండ్రోజుల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు

నైరుతి రుతుపవనాల తిరోగమనంతో రాబోయే రెండు రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురిసే చాన్స్​ ఉంది. హైదరాబాద్​ మహానగరంలోనూ భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారతదేశ వాతావరణ విభాగం-హైదరాబాద్ (IMD-H) వెల్లడించిన అంచనాల ప్రకారం.. ఆదివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షపాతం నమోదు కానుంది. ఇక.. ఉరుములే, మెరుపులతో కూడిన వర్షాలు పడేఅవకాశాలున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అక్టోబరు 18 వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

అక్టోబర్ 18 న ఉత్తర అండమాన్ సముద్రం, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో తుపాను ఏర్పడుతుందని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. అక్టోబరు 20 నాటికి ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి పశ్చిమ-మధ్య భారతదేశం, నైరుతి బంగాళాఖాతంలోకి చేరుతుంది. అక్కడ అల్పపీడనంగా మారి భారీ తుపానుగా మారుతుంది.

ఇక.. శనివారం సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాద్​లోని శేరిలింగంపల్లిలో అత్యధికంగా (4.8 మి.మీ), హయత్‌నగర్ (3.8 మి.మీ), కూకట్‌పల్లి (3.3 మి.మీ), ఆసిఫ్‌నగర్ (3.3 మి.మీ) (2.8 మి.మీ) వర్షపాతం నమోదైంది.

- Advertisement -

అక్టోబర్ ప్రారంభం నుండి మోస్తరు నుండి భారీ వర్షాల కారణంగా హైదరాబాద్​లో మొత్తం వర్షపాతం 147 మి.మీ. సాధారణం నుండి 89.3 మి.మీ. గా నమోదైంది. కొన్ని రోజులుగా నగరంలో నిరంతరం కురుస్తున్న వర్షాల కారణంగా నీటి వనరులకు పెద్ద ఎత్తున ఇన్‌ఫ్లోలు వస్తున్నాయి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్ల నుండి మూసీకి పెద్దమొత్తంలో  నీరు విడుదల అవుతోంది. 

కాగా, ఆదిలాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ సహా దాదాపు అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియడంతో రిజర్వాయర్లు పొంగిపొర్లుతున్నాయి. ఉస్మాన్ సాగర్ నీటిమట్టం శనివారం నాటికి 1,789.50 అడుగులుగా ఉంది, పూర్తి ట్యాంక్ లెవెల్ (ఎఫ్‌టిఎల్) 1,790 అడుగులు. హిమాయత్ సాగర్ నీటి మట్టం 1,763.50 అడుగుల ఎఫ్‌టిఎల్ కంటే 1,763.15 అడుగులకు చేరువలో  ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement