Monday, April 29, 2024

పూర్తిస్థాయి కోవిడ్ ఆస్పత్రిగా గాంధీ హాస్పిటల్

హైదరాబాద్ నగరంలో కరోనా పాజిటివ్ కేసులు విజృంభిస్తున్నాయి. దీంతో నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా పేషెంట్లతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రస్తుతం నగరం నడిబొడ్డున ఉన్న గాంధీ ఆస్పత్రిలో ప్రతి 10 నిమిషాలకు ఓ కరోనా పేషెంట్ అడ్మిట్ అవుతున్నాడు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 450కి పైగా కరోనా రోగులు ఉన్నారు. గురువారం ఒక్కరోజే 150మంది రోగులు గాంధీలో సీరియస్​ కండిషన్‌లో అడ్మిట్ అయ్యారు.

దీంతో గాంధీ ఆసుపత్రిని పూర్తి స్థాయి కోవిడ్​ ఆస్ప్రతిగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్​ సెకండ్​ వేవ్​లో ఈ ఆస్పత్రి కోవిడ్​ ఆస్పత్రిగా సేవలు అందించింది. ఆ తర్వాత కేసులు తగ్గడంతో ఓపీతో పాటు ఇతర సేవలు ప్రారంభించారు. మరోసారి కేసులు పెరగడంతో ఏప్రిల్​ 17 నుంచి గాంధీలో ఓపీతో పాటు ఇతర సేవలు నిలిపేసి.. కోవిడ్​ సేవలు మాత్రమే కొనసాగించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. దీంతో రాబోయే మరో పది రోజులు ఇదే పరిస్థితి ఉంటుందనే అంచనాతో గాంధీని కోవిడ్​ స్పెషల్​ ఆస్పత్రిగా మార్చారు. శనివారం నుంచి ఓపీ, ఎమర్జెన్సీ, ఎలక్టివ్స్​ ఇలా అన్ని సేవలు గాంధీ ఆస్పత్రిలో నిలిపి వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement