Sunday, April 28, 2024

నేటి బంగారం.. వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో ఇవాళ 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.150 మేర పడిపోయింది. వరుసగా రెండు రోజుల్లో రూ.600 దిగివచ్చింది. ప్రస్తుతం తులం రేటు రూ.55 వేల 650 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర తులానికి రూ.160 తగ్గి రూ.60 వేల 710 వద్ద కొనసాగుతోంది. మరోవైపు.. ఢిల్లీలో ఇవాళ 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.150 తగ్గి రూ.55 వేల 800 పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు తులానికి రూ.160 పడిపోయి రూ.60 వేల 860 మార్క్ వద్ద కొనసాగుతోంది. వెండి విషయానికి వస్తే వరుసగా పడిపోతోంది. గత ఐదు రోజుల్లోనే ఏకంగా కిలోపై రూ.2800 దిగివచ్చింది. ఇవాళ కిలో వెండి రేటు హైదరాబాద్ మార్కెట్లో రూ. 300 తగ్గి ప్రస్తుతం రూ.76 వేల 200 మార్క్ వద్ద కొనసాగుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రేటు రూ.150 తగ్గి ప్రస్తుతం రూ.72 వేల 900 ట్రేడింగ్ అవుతోంది. ఢిల్లీతో పోల్చినప్పుడు మన హైదరాబాద్‌లో బంగారం రేటు కాస్త తక్కువగా ఉండడం, వెండి రేటు కాస్త ఎక్కువగా ఉండడం గమనించవచ్చు. అందుకు స్థానికంగా ఉండే ట్యాక్సులు కారణంగా చెబుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement