Thursday, July 25, 2024

People’s March మిష‌న్ భ‌గీర‌థ పేరుతో రూ.42వేల కోట్లు వృథా – భట్టి విక్రమార్క

తిమ్మాజిపేట, ప్రభన్యూస్‌: మిషన్‌ భగీరథ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రూ.42 వేల కోట్ల ప్రాజెక్ట్‌ నిరార్ధకమైందని దానివల్ల ప్రజలకు ఉపయోగం ఏమీ లేదని, ప్రజలకు పక్కా ఇళ్లు లేవు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు అని సీఎల్పీ నాయకుడు విక్రమార్క ఆరోపించారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర శుక్రవారం ప్రవేశించింది. ఈ సందర్భంగా తిమ్మాయిపేట సమీపంలో పిసిసి ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మల్లు రవితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ధరణి బీఆర్‌ఎస్‌ నాయకుల అక్రమాలకు అడ్డగా మారిందని విమర్శించారు.

అదిలాబాద్‌ నుండి చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రలో అనేక అనుభవాలు సంఘట నలు తన దృష్టికి వచ్చాయని.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని ప్రజలు బాధపడుతు న్నారని తన పాదయాత్ర ద్వారా తెలిసిందన్నారు. గతంలో గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కట్టించిన ఇండ్లు మాత్రమే గ్రామాలలో ఉన్నాయని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెప్పినట్లు-గా రెండు గదుల పక్క ఇల్లు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం గ్రామాలలోనూ ఆర్‌డబ్ల్యూఎస్‌ ద్వారా స్థానికంగా ప్రజలకు నీటి సౌకర్యం కల్పిస్తే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందుబాటు-లో ఉన్న నీటి వనరులను కాదని మిషన్‌ భగీరథ పథకం ప్రవేశపెట్టి 42 వేల కోట్లు- కేవలం పైపుల కోసమే ఖర్చు చేశారని ఆయన ఆరోపించారు. గ్రామాల్లో తాగునీటి కోసం గత ప్రభుత్వం ఏర్పాటు- చేసిన తాగునీటి బోర్లను తాళాలు వేయడంతో మిషన్‌ భగీరథ నీళ్లు రాక స్థానికంగా నీటి వనరులు ఉన్న వినియోగించుకోలేని పరిస్థితి లేకపోవడంతో ప్రజలు తాగునీటి కోసం తంటాలు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ధరణి లో అనేక లోపాల్లో ఉన్నాయని ఆ లోపాలను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ భూములను బీఆర్‌ఎస్‌ నాయకులు ఆక్రమించుకునేలా పార్టు బిలో పెట్టేసారని అన్నారు. గ్రామాలలో ప్రజల భూములను ప్రభుత్వ లాక్కోవడం సరైన విధానం కాదన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేక ఆందోళన చెందుతున్నారని తన పాదయాత్రలకు వచ్చి ఉద్యోగాలు కల్పించాలని చెప్పుకునే పరిస్థితి లేదు అన్నారు. ఉద్యోగాలు కల్పించాలని యువత డిమాండ్‌ చేస్తే వారిపై తప్పుడు కేసులు నమోదు చేయించి పోటీ- పరీక్షలకు హాజరుకాకుండా ప్రభుత్వం కుట్ర చేస్తుందనీ నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement