Friday, May 17, 2024

ఈ తేనే చాలా కాస్ట్లీ గురు!


ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఔషధం తేనే. తియ్యంగా ఉండే తీనే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా తేనె భిన్న ర‌కాలుగా అంద‌రికీ అందుబాటులో ఉంటుంది. నాణ్య‌త‌ను బ‌ట్టి దాని ధ‌ర మారుతుంది. కానీ ఏ తేనె అయినా స‌రే దాదాపుగా రుచి ఒక్క‌లాగే ఉంటుంది. అందులో ఉండే ఔష‌ధ విలువ‌లు కూడా ఒక్క‌లాగే ఉంటాయి. తేనె మహా అయితే కిలో రూ.400 ఉంటుంది. మంచి నాణ్యమైన తేనే అయితే రూ. వెయ్యి వరకు ఉండొచ్చు. అయితే ట‌ర్కీకి చెందిన ఓ కంపెనీ మాత్రం భిన్న ర‌కానికి చెందిన తేనెను ఉత్ప‌త్తి చేసింది. అది ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన తేనెగా కూడా పేరుగాంచింది. ఈ తేనె ధర ఎంతో తెలిస్తే..గుండె గుబేల్ మంటుంది. ఇది బంగారం కన్నా ఖరీదైనది. ఈ తేనే ఖరీదు అక్షరాలా రూ.8.8 లక్షలు. ఈ తేనెకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మాములుగా దొరికే తేనే రుచికి తియ్యగా ఉంటుంది. కానీ ఈ తేనె రుచి కొంచెం చేదుగా ఉంటుంది. దీంతో ఈ తేనెకు డిమాండ్ అధికంగా ఉంది.

టర్కీకి చెందిన సెంటారీ హనీ అనే కంపెనీ ప్రపంచ రికార్డు క్రియేట్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన తేను ఉత్పత్తి చేస్తున్న కంపెనీగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. ఈ కంపెనీ తయారు చేసిన ఒక రకం తేనె ఏకంగా కిలోకు రూ.8.8 లక్షలు పలుకుతోంది. ప్రపంచంలో మరే తేనె ధర ఇంతలా ఉండదు. ఈ తేనెను జనావాసాలకు దూరంగా.. సముద్ర మట్టానికి 2500 అడుగుల ఎత్తులో ఉండే గుహల నుంచి సేకరిస్తారు. కొన్నిసార్లు ఇతర దేశాల్లోని అడవులకు వెళ్లి.. అక్కడ గుహల్లో తేనె కోసం అన్వేషిస్తారు. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఈ తేనే లభ్యమవుతుంనది కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అయితే ఈ తేనె ఖ‌రీదైంది అయిన‌ప్ప‌టికీ ఏడాదికి ఒక్క‌సారి మాత్ర‌మే ఇది ఉత్ప‌త్తి అవుతుంది. రుచికి కొద్దిగా చేదుగా ఉన్నప్పటికీ ఔషధ గుణాలు అధికంగా ఉండటంతో ఈ తేనెకు డిమాండ్ అధికంగా ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement