Thursday, May 2, 2024

హిందూ-ముస్లిలు క‌లిసి ఉండండి-లేదంటే దేశం కుప్ప‌కూలిపోయే ప్ర‌మాదం ఉంది-అమ‌ర్త్య‌సేన్

దేశం నేడు ఓ ఉత్పాతం ముంగిట్లో ఉంద‌ని తెలిపారు ప్ర‌ముఖ ఆర్థిక‌వేత్త‌..నోబెల్ అవార్డు గ్ర‌హీత అమ‌ర్త్య‌సేన్. కోల్‌కతాలో రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించిన అనంత‌రం ఆయ‌న ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన దేశ ప్రజలకు కొన్ని హెచ్చరికలు.. కొన్ని సూచనలు చేశారు. దేశం మొత్తంగా కుప్ప కూలిపోయే ముప్పును భారత్ ఎదుర్కొనే అవకాశం ఉన్నదని హెచ్చరించారు. ప్రజలు మతాల వారీగా విడిపోవద్దని, అందరూ ఐక్యం కావడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని సూచించారు. ఎవరైనా ఇప్పుడు తనను దేనికోసమైనా భయపడుతున్నారా? అని అడిగితే ఔననే చెబుతానని వివరించారు.

ఇప్పుడు భయపడటానికీ ఓ కారణం ఉన్నదని తెలిపారు. నేడు దేశంలోని పరిస్థితులే భయాలకు కారణంగా మారాయ‌న్నారు..ఈ దేశ ప్రజలు అందరూ సమైక్యంగా కలిసి ఉండటమే తనకు కావాలని వివరించారు. చారిత్రకంగా ఉదారవాదంతో మెదిలిన ఈ దేశం ఇప్పుడు విచ్ఛిన్నం కావడాన్ని తాను ఇష్టపడటం లేదన్నారు. హిందువులకు చెందిన ఉపనిషత్తులు ప్రపంచానికి ఒక ముస్లిం రాకుమారుడితో తెలియవచ్చిందని వివ‌రించారు. షా జహాన్ కుమారుడు దారా సిఖో సంస్కృతాన్ని నేర్చుకున్నాడని, ఆయన ఉపనిషత్తులను పర్షియా భాషలోకి మార్చారని వివరించారు. భారత్ కేవలం హిందువులకే చెందినది కాదని, అలాగే కేవలం ముస్లింలదే కాదనీ అన్నారు. దేశ సంప్రదాయాలకు అనుగుణంగా ఈ రెండు వర్గాలు కలిసి ఉండాలని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement