Saturday, October 12, 2024

ఓటీటీలో హిందీ వ‌ర్ష‌న్ రాధేశ్యామ్ -మే 4నుంచి స్ట్రీమింగ్

రాధేశ్యామ్ చిత్రం హిందీ వ‌ర్ష‌న్ ని మే 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయ‌నున్నారు. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించింది. ఈ చిత్రంలో ప్ర‌భాస్, పూజాహెగ్డే జంట‌గా న‌టించారు.. సీనియర్ నటుడు కృష్ణంరాజు ఈ చిత్రంలో ఒక కీలక పాత్రను పోషించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. తమన్ మ్యూజిక్ ను అందించారు. థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రొమాంటిక్ లవ్ డ్రామా అభిమానులను నిరుత్సాహ పరిచింది. మరోవైపు ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వర్షన్ లు అమెజాన్ ప్రైమ్ లో ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్నాయి. థియేటర్లలో కంటే ఓటీటీ, టెలివిజన్ లో ఈ చిత్రం కొంత ఎక్కువ సక్సెస్ ను సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement