Monday, April 29, 2024

స‌ల్మాన్ తో పెళ్ళిపై క్లారిటీ ఇచ్చిన ‘సోనాక్షిసిన్హా’

బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ తో పెళ్ళి వార్త‌లు వ‌స్తోన్న నేప‌థ్యంలో హీరోయిన్ సోనాక్షి సిన్హా స్పందించింది. ఆ వార్త‌ల్లో నిజం లేద‌ని కొట్టిపారేసింది. నెట్టింట్లో ఏది ఉంటే అది నమ్మేసే మూర్ఖులు కాదు ఆడియన్స్. అసలు అది నిజమైన ఫోటోనేనా.. లేక మార్ఫింగ్ చేశారా అనేది తెలుసుకోలేనంత ఇదిలో లేరు జనాలు అంటూ కామెంట్ చేసింది సోనాక్షి. ఆ వైరల్ ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సోనాక్షీ తనకు ఎటువంటి పెళ్లి జరగలేదు అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. కాగా సోనాక్షీ సిన్హా.. 2010 లో సల్మాన్‌ హీరోగా వచ్చిన దబాంగ్ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. సోనాక్షి దబాంగ్‌2 లో కూడా సల్మాన్ తో కలిసి నటించింది. ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్ లు చేస్తోంది సోనాక్షీ. ఇక సల్మాణ్ ఖాన్ కబీ ఈద్‌ కబీ దివాళి సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో సెట్స్ పైకి వెళ్ళబోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement