Friday, May 3, 2024

సాయిప‌ల్ల‌విని స‌పోర్ట్ చేసిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై – స్త్రీలే బాడీ షేమింగ్ కి గుర‌వుతున్నార‌ని ఆవేద‌న‌

త‌మిళ మీడియాలో హీరోయిన్ సాయిప‌ల్ల‌వి గురించి ప్ర‌చురించిన క‌థ‌నం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దేవ‌దాసి పాత్ర‌లో సాయిప‌ల్ల‌వి అంద‌విహీనంగా ఉంద‌ని రాశారు. సాయిపల్లవిపై ట్రోలింగ్ జరుగుతోన్న నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. గతంలో తాను కూడా ఇలాంటి వేదన అనుభవించాన‌న్నారు. సాయిపల్లవి రూపాన్ని విమర్శించడం చాలా బాధ కలిగించిందని తెలిపారు. ఇలాంటి మాటలు ఎదుర్కొన్నవారికే ఆ బాధ తెలుస్తుందని, కానీ, పట్టుదల, శ్రమ, ప్రతిభతో అలాంటి మాటలను అధిగమించానని తమిళిసై వివరించారు. పొట్టిగా, నల్లగా పుట్టడం మన తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రతిదాంట్లోనూ అందం ఉంటుందని, కాకి పిల్ల కాకికి ముద్దే కదా అని వ్యాఖ్యానించారు. ఈ సమాజంలో ఎక్కువగా స్త్రీలే బాడీ షేమింగ్ కు గురవుతున్నారని, పురుషులకు 50 ఏళ్లు వచ్చినా వారిని యువకులుగా చూస్తుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు ఎదుగుతుంటే ఇలాంటి మాటల ద్వారా అడ్డుకుంటుంటారు అని తమిళిసై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement