Friday, May 3, 2024

హీరో రాజ‌శేఖ‌ర్ బ‌ర్త్ డే – ‘శేఖ‌ర్’ మూవీ నుండి లిరిక‌ల్ సాంగ్ రిలీజ్

యాంగ్రీమ్యాన్ రాజ‌శేఖ‌ర్ బ‌ర్త్ డే నేడు..పోలీస్ క్యారెక్ట‌ర్ల‌కి పెట్టింది పేరని అంద‌రికీ తెలిసిందే. ఇక ఫ్యామిలీ డ్రామా చిత్రాల్లో ఆయ‌న ఎమోష‌న్ పండించే తీరు అద్భుత‌మ‌నే చెప్పాలి. కాగా రాజ‌శేఖ‌ర్ తాజా చిత్రం శేఖ‌ర్. ఈ చిత్రాన్ని రాజ‌శేఖ‌ర్ భార్య జీవిత రాజ‌శేఖ‌ర్ డైరెక్ష‌న్ లో తెర‌కెక్క‌నుంది. కాగా ఫస్టులుక్ తోనే ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఏర్పడింది. మలయాళంలో ఆ మధ్య వచ్చిన ‘జోసెఫ్’కి ఈ సినిమా రీమేక్. ఒరిజినల్లో పాటలు ఉండవు .. కథ సీరియస్ గా నడుస్తుంది. కానీ తెలుగు నేటివిటీకి తగినట్టుగా కాస్త రొమాన్స్ ను జోడించినట్టుగా తెలుస్తోంది. రిటైర్మెంట్ తీసుకున్న ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలతో ఈ కథ నడుస్తుంది.

త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. బీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి రాజశేఖర్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఈ రోజు రాజశేఖర్ పుట్టినరోజు కావడంతో, ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘ఓ సన్నజాజి తీగలా అల్లుకోవే నన్నిలా .. కిన్నెరా .. ఓ కిన్నెరా, సంకురాత్రి పంటలా పంచుకోవే నన్నిలా కిన్నెరా ఓ కిన్నెరా’ అంటూ ఈ పాట సాగుతోంది. అనూప్ రూబెన్స్ స్వరపరిచిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా, అర్మాన్ మాలిక్ ఆలపించారు. మొదటిసారి వినగానే ఈ పాట మనసుకు హ‌త్తుకునేలా ఉంది.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement