Tuesday, May 21, 2024

మంచు విష్ణు మూవీలో ‘స‌న్నీ లియోన్’

హీరో మంచు విష్ణు కొత్త చిత్రంలో న‌టిస్తున్నాడు. గాలి నాగేశ్వ‌ర‌రావు అనే పాత్ర‌లో మెర‌వ‌నున్నాడు. ఈ చిత్రానికి ఇషాన్ సూర్య డైరెక్ట‌ర్. ఈ క్యారెక్టర్ డిజైన్ చేసిన స్కెచ్ ని సోషల్ మీడియాలో మంచు విష్ణు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రాజ్‌పుత్ పాయిల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. తాజాగా ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ స‌న్నీలియోన్ జాయిన్ అయింది. రేణుక పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు సన్నీలియెన్ త‌న ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ చిత్రం తిరుప‌తిలో షూటింగ్ జ‌రుపుకొంటోంది. ఈ రోజు స‌న్నీలియోన్ ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొంది. గ‌తంలో మంచు మ‌నోజ్ హీరోగా తెర‌కెక్కిన ‘క‌రెంట్ తీగ’ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈసారి మంచు విష్ణుతో రీ ఎంట్రీ ఇస్తుంది. ఇందులో స‌న్నీ పాత్ర కేవ‌లం గ్లామ‌ర్‌కే పరిమితం కాకుండా క‌థ‌ను మ‌లుపు తిప్పే పాత్ర‌లో న‌టించ‌నుంద‌ట‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement