Friday, May 17, 2024

ముస్లింల‌కు నా స‌లాం – హీరో బాల‌కృష్ణ‌

ముస్లిం సోదరులకు టీడీపీ నేత‌, సినీ న‌టుడు నందమూరి బాలకృష్ణ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మ‌త‌ గురువు మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త చూపిన మార్గాన్ని అనురిస్తూ నెల‌రోజులు ఉపావాస దీక్ష పూర్తి చేసుకున్న ముస్లింల‌కు నా స‌లాం అన్నారు హీరో బాల‌కృష్ణ‌. సత్ప్రవర్తనతోనే సామాజిక మార్పు సాధ్యమన్న మహ్మద్ ప్రవక్త సూక్తులు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఓ వైపు ఆధ్యాత్మిక‌త‌, మ‌రోవైపు స‌ర్వ మాన‌వ స‌మాన‌త్వాన్ని, సేవా భావాన్ని చాటి చెప్పేదే రంజాన్ అన్నారు. ఈ రంజాన్ ప‌ర్వ‌దినం అంద‌రి జీవితాల్లో వెలుగులు నింపాల‌ని, అంద‌రూ సుఖ సంతోషాల‌తో ఉండాల‌ని, దేవుడు మ‌న అంద‌రికీ మంచి భ‌విష్య‌త్తుని ప్ర‌సాదించాల‌ని కోరుకుంటున్నాన‌ని చెప్పారు బాల‌కృష్ణ‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement