Monday, May 6, 2024

ఆకాష్ పూరీ కొత్త చిత్రం చోర్ బ‌జార్ – రేపు లిరిక‌ల్ సాంగ్ రిలీజ్

హీరో, డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాష్ పూరీ ఈసారి ఊర‌మాస్ స‌బ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాడు. చోర్ బ‌జార్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. వీఎస్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి, ‘జార్జిరెడ్డి’ డైరెక్టర్ జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి సురేశ్ బొబ్బిలి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా నుంచి ఫస్టు లిరికల్ సాంగ్ ను రేపు ఉదయం 9:06 గంటలకు వదలనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. రేపు రిలీజ్ కానున్నది టైటిల్ సాంగ్ అనే విషయం ప్రోమోను బట్టి తెలుస్తోంది.ఈ సినిమాలో ఆకాశ్ జోడీగా గెహనా సిప్పీ పరిచయం కానుంది.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement