Wednesday, May 1, 2024

Bike Racer | బైక్‌పై వ‌ర‌ల్డ్ టూర్‌.. రెడీ అంటున్న హీరో అజిత్‌

బైక్ రేసింగ్ అంటే ఎంతో ఇష్టపడే సినీ నటుడు అజిత్ కుమార్‌.. సినిమా షూటింగ్‌ విరామ సమయాల్లో ఇంట్రెస్టింగ్ క‌లిగించేలా టూర్స్ వేస్తుంటాడు. ఈమ‌ధ్య ఉత్తరాది రాష్ట్రాలతో పాటు నేపాల్, భూటాన్ దాకా బైక్ పైన వెళ్లాడు. డిఫ‌రెంట్ రోల్స్‌లో అభిమానుల‌ను ఆక‌ట్టుకునే ఈ నటుడు మరోసారి బైక్ పైన సాహస యాత్రకు రెడీ అవుతున్న‌ట్టు ఇవ్వాల (బుధ‌వారం) వెల్ల‌డించాడు. బైక్ మీద అజిత్‌ ప్రపంచ యాత్ర చేయనున్నట్లు అత‌ని మేనేజర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు.

అజిత్ ఇప్పటికే బైక్‌పై ఎన్నో సాహస యాత్రలు చేశాడని, సవాళ్లతో కూడిన భూభాగంలో ప్రయాణించారని, తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కొన్నారని, ఇటీవల పలు ప్రాంతాల్లో పర్యటించారని పేర్కొన్నారు. త్వరలో ఆయన మరో యాత్రకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ఈ ఏడాది నవంబర్ నుండి అజిత్ తన బైక్ ‌పై ప్రపంచ యాత్రకు సిద్ధమవుతున్నారని తెలిపారు. ఈ సాహస యాత్ర కోసం అజిత్ ఓ తమిళ సినిమా షూటింగ్ ను చాలా వేగంగా పూర్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement